Poolamme Pilla | పూలమ్మే పిల్లా పూలమ్మే | Hanuman Movie Song Lyrics Telugu
పూలమ్మే పిల్లా పూలమ్మే | Poolamme Pilla | Hanuman Movie Song Lyrics Telugu | Download
Song Details :
Movie Name : HanuMan (Telugu)
Song Name : Poolamme Pilla
Lyrics - Kasarla Shyam
పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా
పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా
గుండెను ఇల్లా దండగా అల్లా
పూలమ్మే పిల్లా
పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా
అమ్మాయి జల్లో చేరేది ఎల్లా
పూలమ్మే పిల్లా
మూరెడు పూలే మా రాణికీవే
చారేడు చంపల్లే సురీడై పూసెలే
ఎర్రగ కందెలే నున్నాని బుగ్గలే
పిల్ల పల్లేరు కాయ సూపుల్ల
సిక్కి అల్లాడినానే సేపల్లా
పసిడి పచ్చాని అరసేతుల్లా
దారపోస్తా ప్రాణాలు తానే అడగాల
సీతాకోకల్లే రెక్క విప్పేలా
నవ్వి నాలోన రంగు నింపాలా
హే మల్లి అందాల సెండుమళ్ళీ
గంధాలు మీద జల్లి
నను ముంచి వేసెనే
తనపై మనసు జారి
వచ్ఛా ఏరి కొరి
మూరెడు పూలే మా రాణికీవే
చారేడు చంపల్లే సురీడై పూసెలే
ఎర్రగ కందెలే నున్నాని బుగ్గలే
పిల్ల అల్లాడిపోయి నీ వల్లా
ఉడికి జరమొచ్చినట్టు నిలువెళ్ళ
బలమే లేకుండా పోయే గుండెల్లా
ప్రేమ మందే రాసియ్యే మూడు పూటల్లా
ఎల్లి పోతుంటే నువ్వు వీధుల్లా
తుల్లి ఊగిందే ఒళ్ళు ఉయ్యాలా
హే తెల్ల తెల్లాని కోటు పిల్ల
దాచేసి జేబులల్ల నను మోసుకెల్లవే
పట్నం సందమామ
సిన్న నాటి ప్రేమ
పూలమ్మే పిల్లా పూలమ్మే పిల్లా
అమ్మాయి జల్లో చేరేది ఎల్లా
పూలమ్మే పిల్లా
మూరెడు పూలే మా రాణికీవే
చారేడు చంపల్లే సురీడై పూసెలే
ఎర్రగ కందెలే నున్నాని బుగ్గలే

Comments
Post a Comment